హరహర మహాదేవ.. శంభో శంకర
వైభవంగా పరమేశ్వరస్వామి రథోత్సవం
● శివనామ స్మరణతో మార్మోగిన
ఆలయ పరిసరాలు
● వేలాదిగా తరలివచ్చిన భక్తులు
● కొనసాగుతున్న జాతర
సమావేశానికి హాజరైన
విద్యాశాఖ అధికారులు
ఆత్మకూర్: పట్టణంలో పరమేశ్వరస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం రాత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు, రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని భక్షాలు, పచ్చిపులుసు, అన్నం నైవేద్యంగా సమర్పించి దాసంగాలు సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాతర కమిటీ వెంకటనర్సింహారావు, మణివర్ధన్‌రెడ్డి, సాయిరాఘవ, యాదగిరిశెట్టి, తెలుగు నగేష్ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.


