ధైర్య సాహసాలకు ప్రతీక ఛత్రపతి శివాజీ
కొత్తకోట రూరల్: ఛత్రపతి శివాజీ మహరాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచారని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం పుర కేంద్రంలో హిందూవాహిని ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంత్యుత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై శివాజీ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శివాజీ ఆశయాలు నేటి యువతకు ఆదర్శమని, సమాజంలో ధర్మం, న్యాయం కోసం కృషి చేయాలని కోరారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడంతో సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం శోభాయాత్ర పట్టణ ప్రధాన వీధుల్లో కొనసాగింది. ఎమ్మెల్యేతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, హిందూవాహిని సభ్యులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
ధైర్య సాహసాలకు ప్రతీక ఛత్రపతి శివాజీ


