అత్యుత్తమంగా 108 వాహన సేవలు
కొత్తకోటరూరల్/వనపర్తి రూరల్/వీపనగండ్ల: ఉమ్మడి జిల్లాలోని 108, 102 వాహనాలు అత్యుత్తమ సేవలు అందిస్తున్నాయని ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి అన్నారు. గురువారం కొత్తకోట, పెబ్బేరు, వీపనగండ్లలోని 108, 102 వాహనాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వాహనాల్లో పరికరాల పనితీరు, ఔషధాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులు, ఆపదలో ఉన్న వారిని వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రులకు 108 వాహనాల్లో తరలిస్తున్నామన్నారు. 102 అమ్మఒడి వాహనాలు గర్భిణులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లితిరిగి ఇళ్లకు చేరుస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయిన తర్వాత తల్లీబిడ్డను ఇంటి దగ్గర ఉచితంగా దించుతున్నామని, ఐదేళ్లలోపు చిన్నారులను టీకాల కోసం అమ్మఒడి వాహనాలను వినియోగిస్తున్నామని వివరించారు. ప్రజలందరూ ఆయా సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ మహబూబ్, రత్నం, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ రాము, ఖాజా మోయినుద్దీన్, పైలెట్లు చంద్రశేఖర్, వేణు, పాల్గొన్నారు.
పీజీ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ సెమిస్టర్–1కి సంబంధించి రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షలు గురువారం ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు పీయూలోని పీజీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రవీణ, ప్రిన్సిపాల్ మధుసూదన్‌రెడ్డి తదితరులు తనిఖీ చేశారు. పరీక్షలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పీయూ పరిధిలో మొత్తం 1,851 మంది విద్యార్థులకు గాను 11 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో మొదటిరోజు పరీక్షకు 1,506 మంది హాజరవగా.. 346 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాకేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్‌కు పాల్పడుతుండగా అధికారులు డిబార్ చేశారు.
వేరుశనగ ధర ౖపైపెకి
జడ్చర్ల: బాదేపల్లిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం వేరుశనగ ధర రూ.10 వేలకు పైగా పలికింది. ఇటీవల ధరలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో గురువారం వేరుశనగ క్వింటాల్‌కు గరిష్టంగా రూ.10,369, కనిష్టంగా రూ.4,069 ధరలు లభించాయి. అలాగే కందులు క్వింటాల్ గరిష్టంగా రూ.7,770, కని ష్టంగా రూ.5,009, మినుములు గరిష్టంగా రూ.8,239, కనిష్టంగా రూ.8,139, మొక్క జొన్న గరిష్టంగా రూ.1,880, కనిష్టంగా రూ.1,761, పెబ్బర్లు రూ.6,633 ధరలు లభించాయి.
అత్యుత్తమంగా 108 వాహన సేవలు


