అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం
కొత్తకోట: పురపాలికల అభివృద్ధి కాంగ్రెస్‌పార్టీతోనే సాధ్యమవుతుందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. పుర నామినేషన్ల ప్రక్రియ చివరిరోజు శుక్రవారం పట్టణంలో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేయించారు. అనంతరం కొత్తకోట చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పట్టణంలో డివైడర్ నిర్మాణం తప్ప ఇతర పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించామని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో బాలికల ఉన్నత పాఠశాల భవన నిర్మాణం చేపట్టి త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అలాగే ఆస్పత్రి నిర్మాణం కూడా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇటీవల రూ.17 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, కొత్తకోటను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. పురపాలికలోని 15 వార్డులను తామే గెలుచుకొని జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, పి.కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, ఎన్‌జే బోయేజ్, డా. పీజే బాబు, రావుల కరుణాకర్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, వేముల శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


