ఎన్నికల ఖర్చు లెక్క పక్కాగా ఉండాలి
అమరచింత: మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల ఖర్చుల లెక్కలు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల ఖర్చుల పరిశీలకులు ఎం.శ్రీనివాసులు అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అభ్యర్థులు సమర్పించిన ఎన్నికల ఖర్చు వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అభ్యర్థి రూ.లక్ష వరకు ఎన్నికల్లో ఖర్చు చేయాల్సి ఉందన్నారు. రూ. 5వేలకు పైబడి ఖర్చు చేస్తే.. అందుకు సంబంధించి డిజిటల్ పేమెంట్ లేదా చెక్కు రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. బిల్లులు సైతం జత చేయాలన్నారు. ప్రతి లెక్కను ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఫారంలో నమోదు చేయాలని సిబ్బందికి సూచించా రు. ఆయన వెంట అబ్జర్వర్ మహ్మద్ యూసుఫ్, మున్సిపల్ కమిషనర్ నూరుల్‌నదీం ఉన్నారు.
మజ్లిస్‌కు మద్దతుగా నిలవండి : ఓవైసీ
స్టేషన్ మహబూబ్‌నగర్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్‌కు మద్దతుగా నిలిచి ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జిల్లాకేంద్రంలోని షాసాబ్‌గుట్ట దర్గా ఆవరణలో సోమవారం జరిగిన ఎన్నికల సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అధికారంలో ఉన్నామని ఒకరు, ఢిల్లీలో అధికారంలో ఉన్నామని మరొకరు, పదేళ్లు పాలించామని ఇంకొకరు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయమని అడుగుతారని, మీరందరూ గుర్తుంచుకోవాలి ఈ ఎన్నికల వల్ల అధికారం ఏర్పడన్నారు. క్షేత్రస్థాయిలో ఈ ఎన్నికలు చాలా కీలకమన్నారు. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్ కార్పొరేటర్, వనపర్తి, గద్వాల, కల్వకుర్తి, నారాయణపేట, నాగర్‌కర్నూల్, మక్తల్ పట్టణాల్లో మున్సిపల్ ఎన్నికల్లో నిలబడిన ఎంఐఎం అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతుకే డివిజన్లలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తారని అన్నారు. బిహార్‌లో ఐదుచోట్ల ఎమ్మెల్యే సీట్లు గెలిచినట్లు తెలిపారు. మజీస్ పార్టీతో వ్యతిరేకించిన ఒక వ్యక్తి నిలబడితే ఆయనకు డిపాజిట్ కూడా రాలేదన్నారు. మహారాష్ట్రలో 125 మున్సిపల్ కార్పొరేటర్ స్థానాలను మజ్లిస్ పార్టీ గెలిచినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 33 చోట్ల కార్పొరేటర్, ముంబైలో 8 చోట్ల కార్పొరేటర్ స్థానాల్లో గెలవడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంఐఎం పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. సభలో మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే వారిస్ పఠాన్, ఎంఐఎం ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జాబిర్ బిన్ సయీద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు అబ్దుల్ హాదీ, మక్సూద్‌బిన్ అహ్మద్ జాకీర్, ఎన్నికల ఇన్‌చార్జిలు జఫర్‌ఖాన్, అన్వర్‌సాదత్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షులు సాదుతుల్లా హుస్సేని, ఎంఐఎం కార్పొరేటర్ అభ్యర్థులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికల ఖర్చు లెక్క పక్కాగా ఉండాలి


