మున్సిపల్ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పండి
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పాలన చేపట్టిన కేసీఆర్ భవిష్యత్‌లో వందేళ్ల వరకు సాగు, తాగునీటి కష్టాలు రాకుండా కాల్వలు, ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన బీఆర్‌ఎస్ కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో హామీలిచ్చిన కాంగ్రెస్ నాయకులు.. వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. వారికి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని ప్రజలు ఇదివరకే గుర్తించి.. సర్పంచ్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ బుద్ధి చెప్పి, బీఅర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంంలో శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, గట్టుయాదవ్, బి.లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, పలుస రమేశ్‌గౌడ్, నందిమల్ల అశోక్, గంధం బాలపీరు, వేణుగోపాల్, గులాం ఖాదర్‌ఖాన్, బొబ్బిలి ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


