‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Feb 1 2026 3:01 AM | Updated on Feb 1 2026 3:01 AM

‘పది’

‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

వీపనగండ్ల: విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయని జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి శేఖర్‌, డీసీఈబీ చైర్మన్‌ మద్దిలేటి అన్నారు. శనివారం మండలంలోని తూంకుంట ఉన్నత పాఠశాల ఆవరణలో జీవశాస్త్రంపై నిర్వహించిన కాంప్లెక్స్‌ సమావేశానికి వారు హాజరై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధచూపి మంచి మార్కులు సాధించేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి రోజు పాఠశాలకు హాజరయ్యేలా చూడాలని కోరారు. ఉపకరణాలు వినియోగించి పాఠ్యాంశాలు బోధిస్తే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నర్సింహ, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసులు, కాంప్లెక్స్‌ కార్యదర్శులు శివరాములు, మల్లేశ్‌, సీఆర్పీ నాగరాజు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

‘కేసీఆర్‌పై కక్ష సాధింపు సరికాదు’

వనపర్తిటౌన్‌: తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్ష సాధింపు మానుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ పలుస రమేష్‌గౌడ్‌ అన్నారు. కేసీఆర్‌కు సిట్‌ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం రాత్రి జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌చౌక్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి మాట్లాడారు. పుర ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అధికార పార్టీ కక్ష రాజకీయాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఫోన్‌ ట్యాపింగ్‌ డ్రామాను తెరపైకి తెచ్చారన్నారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయలేక డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నాయకులు హేమంత్‌, ధర్మానాయక్‌, మాజీ కౌన్సిలర్లు ఉంగ్లం తిరుమల్‌, బండారు కృష్ణ, ఆవుల రమేష్‌, సయ్యద్‌, జమీల్‌, జోహెబ్‌ హుస్సేన్‌, మురళిసాగర్‌, కవిత నాయక్‌, మంద రాము, బొబ్బిలి ప్రేమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం

కొత్తకోట రూరల్‌: పట్టణ సమీపంలోని వెంకటగిరి ఆదిశిలా క్షేత్రంలో వెలిసిన భూదేవి లక్ష్మీవేంకటేశ్వస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి కల్యాణం వైభవంగా జరిగింది. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూధన్‌రెడ్డి దంపతులతో పాటు అలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే రావుల రవీంద్రనాథ్‌రెడ్డి దంపతులు, వనపర్తి మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.ప్రశాంత్‌, పి.కృష్ణారెడ్డి, రావుల కరుణాకర్‌రెడ్డి, మేస్త్రి శ్రీనివాసులు, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, వేముల శ్రీనివాస్‌, చర్లపల్లి శేఖర్‌రెడ్డి, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, పి.విశ్వేశ్వర్‌, గుంత మల్లేష్‌, గాడీల ప్రశాంత్‌ పాల్గొన్నారు.

‘పది’ విద్యార్థులపై  ప్రత్యేక దృష్టి 1
1/2

‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

‘పది’ విద్యార్థులపై  ప్రత్యేక దృష్టి 2
2/2

‘పది’ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement