ఉపసంహరణలపై ఉత్కంఠ!
వనపర్తిటౌన్: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పుర ఎన్నికల బరిలో నిలిచేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి ఒక్కో వార్డులో ఇద్దరు మొదలు 10 మంది వరకు నామినేషన్లు వేశారు. ఉపసంహరణకు ఒకరోజే గడువు ఉండటం.. అభ్యర్థులు ఎవరికి వారు టికెట్ తమకంటే తమకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో అధికారపార్టీలో అత్యధిక వార్డుల్లో ప్రజలు, రాజకీయ నాయకులకు గందరగోళం నెలకొంది. బరిలో ఎవరుంటారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రచారం చేసేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నారు.
● 80 వార్డులున్న వనపర్తి మున్సిపాలిటీలో కాంగ్రెస్ నుంచి 176, బీఆర్‌ఎస్ నుంచి 120, బీజేపీ నుంచి 93 మంది నామినేషన్లు వేశారు. ప్రధానంగా కాంగ్రెస్‌పార్టీకి పాత, కొత్త కలయిక తలనొప్పిగా మారింది. బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉంటారు.. ఎంత మంది ఉపసంహరించుకుంటారు.. ఏయే పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై మంగళవారం సాయంత్రం స్పష్టత రానుంది.
నయానో.. భయానో...
రెబల్స్‌ను నయానో భయానో ఒప్పించి ఉపసంహరించుకునేలా ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. పలు వార్డుల్లో టికెట్ వస్తుందనుకున్న అభ్యర్థులు రెబల్స్‌కు ఫోన్‌చేసి రహస్యంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం. మరికొన్ని చోట్ల పట్టణ, జిల్లాస్థాయి నాయకులు రంగంలోకి దిగి ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఏ మేరకు ఫలిస్తాయో వేచిచూడాలి మరి.
అధికార కాంగ్రెస్‌పార్టీ నుంచి రెబల్స్‌గా పోటీచేసే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే యోచనలో డీసీసీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి వద్ద ప్రస్తావించగా.. రాజకీయ సమీకరణాల దృష్ట్యా పార్టీ నిర్ణయానికి కట్టుబడని నాయకులు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, ఉపసంహరణల మరుసటి రోజే సస్పెండ్ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
పలు వార్డుల్లో 10కిపైగా నామినేషన్లు
అధికార కాంగ్రెస్‌పార్టీ నుంచేఅత్యధికంగా..
బుజ్జగింపులకు ఒప్పుకోకుంటేసస్పెండ్‌కు వెనుకాడొద్దని డీసీసీ నిర్ణయం
కులాల వారీగా ఓట్లు చీల్చేందుకు అభ్యర్థుల వ్యూహాలు
ఆత్మకూర్‌లో..:
ఆత్మకూర్: స్థానిక పురపాలికలో పది వార్డులుండగా.. 32 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాగా అధికారపార్టీలో టికెట్ల కేటాయింపు ఎటూ తేలకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్‌ఎస్ నుంచి 15 మంది, బీజేపీ నుంచి 13 మంది నామినేషన్లు వేశారు. ఆయా పా ర్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఆదివారం నాటికి ఒ క్కరు కూడా నామినేషన్ ఉపసంహరించుకోలేదు.
రంగంలోకి మంత్రి వాకిటి..
అభ్యర్థుల ఎంపికపై మంత్రి వాకిటి శ్రీహరి ఆచితూచి వ్యవహరిస్తున్నారని తెలిసింది. సర్వే లు, ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా గెలుపు గుర్రాలకే బీఫారాలు ఇచ్చే యోచనలో ఉన్నారని, మంగళవారం ఉదయం ఎంపిక చేసిన అభ్యర్థులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. రెబల్స్ సైతం నామినేషన్లు ఉపసంహరించుకునేలా మంత్రి నచ్చజెబుతారని తెలిసింది.
కుదరని పొత్తులు..
బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పోటీ చేయనున్నట్లు ముందు నుంచి ప్రచారం జరిగినా.. నాయకుల మధ్య సయోధ్య కుదరక ఒంటరి పోరుకే సిద్ధమయ్యారు. ఆయా పార్టీలు ఇదివరకే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. అధికార కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మధ్య పొత్తుల చర్చలు విఫలం కావడంతో సీపీఐ, సీపీఎం పోటీకి దూరంగా ఉన్నాయి.
వేటుకు రంగం సిద్ధం..


