ఆముదం కాయలు తిన్న చిన్నారులు
ఖిల్లాఘనపురం: సెలవుదినం కావడంతో ఆటలు ఆడుకుంటున్న చిన్నారులు అడవి ఆముదం కా యలు తిని అస్వస్థతకు గురైన ఘటన ల్లాఘనపురంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలకేంద్రానికి నందిని, కిషోర్, నైని, ఆనంది, హేమంతు, రక్షిత, యశ్వంత్, హిమాన్షు, సౌమ్య మొత్తం 9 మంది చిన్నారు లు ఆదివారం కావడంతో కలిసి ఆడుకున్నారు. వీరు ఓ ఇంటి ఆవరణలో ఉన్న అడవి ఆముదం కాయలు తిన్నారు. అనంతరం యథావిధిగా ఎవ రింటికి వాళ్లు వెళ్లిపోగా.. కాసేపటికి వారు వాంతులు చేసుకున్నారు. గుర్తించిన కాలనీవాసులు చిన్నారుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఏం జరిగిందని తల్లిదండ్రులు ప్రశ్నించగా వారు తిన్న కాయలను చూయించారు. వెంటనే మండలకేంద్రంలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చిన్నారుల ప్రాణాలకు ఎలాంటి హాని లేదని వైద్యులు పేర్కొన్నారు.
9 మందికి అస్వస్థత..
జిల్లా ఆస్పత్రికి తరలింపు


