అవినీతి కూపం.. బీఆర్‌ఎస్ పాలన
బీఆర్‌ఎస్ పదేళ్ల పాలన అవినీతి కూపమని.. వారికి మరోసారి పాలనాధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లాకేంద్రంలోని రాజమహల్ ముఖద్వారం వద్ద ఏర్పాటుచేసిన కార్నర్ మీటింగ్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డిలతో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. అన్ని మున్సిపాలిటీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగిస్తుందని చెప్పారు. పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తుందన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే.. అభివృద్ధిని అడ్డుకున్నవారవుతారని మంత్రి అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పార్టీ నాయకులు శంకర్ ప్రసాద్, తిరుపతయ్య, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


