ఓటు.. వజ్రాయుధం | - | Sakshi
Sakshi News home page

ఓటు.. వజ్రాయుధం

Feb 9 2026 7:20 AM | Updated on Feb 9 2026 7:20 AM

ఓటు..

ఓటు.. వజ్రాయుధం

సమర్థుడైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం

వనపర్తి టౌన్‌: ‘ఓటు వేయకుంటే ఏమవుతుంది.. ఓటేయడం అంత అవసరమా? అని భావించొద్దు.. ఓటు అనేది సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. ఉత్తమ భవిష్యత్‌ను నిర్ణయించేందుకు తోడ్పడుతుంది’ అని ప్రజాసంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలో ‘ఓటరు చైతన్యం’ అనే అంశంపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో చర్చావేదిక నిర్వహించగా.. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉపాధ్యాయులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఆ ఓటుకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలకు సేవ చేసే వారిని గుర్తించి ఎన్నుకోవాలని సూచించారు. ఓటును అమ్ముకుంటే ప్రజాస్వామ్యాన్ని కాటేసినట్లేనని.. పార్టీకో, సామా జిక వర్గానికో తావు ఇవ్వకుండా పనిచేసే వారికి పట్టం కడితే ప్రజాస్వామ్యం పురోగమిస్తోందన్నారు.

ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దు

‘సాక్షి’ చర్చావేదికలో

అభిప్రాయాలను వెల్లడించిన

ప్రజాసంఘాల నాయకులు

ఓటు.. వజ్రాయుధం 1
1/1

ఓటు.. వజ్రాయుధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement