మార్మోగిన శివనామస్మరణ
మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మండలంలోని పామాపురం గ్రామ సమీపంలో ఉన్న రామేశ్వరస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెనుక భాగాన ఉన్న ఊకచెట్టు వాగులో ఏర్పాటు చేసిన 36 అడుగుల శివుడి విగ్రహాన్ని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకుడు బిజ్జుల సురేందర్‌రెడ్డి వాలంటీర్ల సాయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు చేపట్టారు. – కొత్తకోట రూరల్
మార్మోగిన శివనామస్మరణ
మార్మోగిన శివనామస్మరణ


