జేఈఈ మెయిన్స్‌లో ‘ఖిల్లా’ విద్యార్థి ప్రతిభ
ఖిల్లాఘనపురం: మండలంలోని సోళీపురం గ్రామానికి చెందిన బొంగు శ్రీనివాసులు, బొంగు విజయలక్ష్మి కుమారుడు బొంగు యోగేందర్ జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చారు. సోమవారం విడుదలైన ఫలితాల్లో విద్యార్థి 99.24 పాయింట్లు సాధించినట్లు తల్లిదండ్రులు వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థిని తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు, మండల నాయకులు అభినందించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన యోగేందర్ బీచ్‌పల్లి గురుకుల పాఠశాలలో పదోతరగతి చదివి 10 జీపీఏ సాధించారు. అలాగే హైదరాబాద్‌లోని గౌలిదొడ్డిలో ఉన్న టీఎస్‌ఆర్‌డబ్ల్యూ కళాశాలలో ఇంటర్ చదివి 997 మార్కులు సాధించారు.


