డీ8 మేజర్‌–2 కాల్వకు గండి | - | Sakshi
Sakshi News home page

డీ8 మేజర్‌–2 కాల్వకు గండి

Feb 19 2026 9:39 AM | Updated on Feb 19 2026 9:39 AM

డీ8 మేజర్‌–2 కాల్వకు గండి

డీ8 మేజర్‌–2 కాల్వకు గండి

గోపాల్‌పేట: మండల కేంద్రం నుంచి ఏదుట్లకు వెళ్లే దారిలో ఉన్న డీ8 మేజర్‌–2 కాల్వ ప్రారంభంలో బుధవారం గండిపడి పంట పొలాల మీదుగా ఉధృతంగా పారింది. కాల్వలో నీరు పారేందుకు ఏర్పాటు చేసిన రెండు గూనలు కొట్టుకుపోయాయి. వెంటనే రైతులు నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో డీఈ వెంకటరమణమ్మ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి తల్పునూరు సమీపంలో ఉన్న గేటును మూసివేయించారు. ప్రతిసారి ఈ ప్రాంతంలోనే కాల్వకు గండి పడుతోందని.. ఇప్పటి వరకు రెండు, మూడుసార్లు తెగిందని రైతులు చెబుతున్నారు. గురువారం వరకు నీటి ఉధృతి తగ్గుముఖం పడుతుందని పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని డీఈ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement