జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు
పాన్‌గల్: జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని.. రైతులు ఆందోళన చెందవద్దని ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయశాఖ అధికారి దామోదర్‌గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయంలో యూరియా పంపిణీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యూరియా పంపిణీపై అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని, అవసరం ఉన్న రైతులే తీసుకోవాలని సూచించారు. గురువారం ఒక్కరోజే 1,650 బస్తాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. అంతకుముందు పంపిణీ చేసిన వివరాలను ఆయన పరిశీలి ంచారు. కార్యక్రమంలో ఏఓ మణిచందర్, సింగిల్‌విండో అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లోనే యూరియా బుకింగ్..
కొత్తకోట రూరల్: వానాకాలంలో యూరియా కొరత, రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సాగుకుగాను బుకింగ్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఇన్‌చార్జ్ జిల్లా వ్యవసాయ అధికారి, కొత్తకోట ఏడీఏ దామోదర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదని.. ఆన్‌లైన్ బుకింగ్ యాప్ ద్వారా సులభంగా పొందవచ్చని పేర్కొన్నారు. జిల్లా రైతులు సమీప ఫర్టిలైజర్ డీలర్ దగ్గర ఎంత స్టాక్ ఉందో తెలుసుకొని ఫోన్‌నంబర్, పట్టాదారు పాసు పుస్తకం ఉపయోగించి బుక్ చేసుకోగలరని సూచించారు. ఏమైనా సందేహాలుంటే ఏఈఓలు లేదా ఏఓలను సంప్రదించాలన్నారు.


