పూత దశలో పురుగు మందులు వాడొద్దు
వీపనగండ్ల: మామిడి తోటలకు పూత దశలో పురుగు మందులు వినియోగిస్తే అధిక నష్టం వాటిల్లుతుందని కీటక శాస్త్రవేత్త డా. షహనాజ్, ఉద్యాన శాస్త్రవేత్త డా. మాధవి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని రైతువేధికలో మా మిడిలో యాజమాన్య పద్ధతులపై జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు వా రు హాజరై పలు సూచనలిచ్చారు. నల్ల తామర పురుగు నివారణకు నీలిరంగు అట్టలను తోటల్లో ఏర్పాటు చేసుకోవాలని, వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చని సూచించారు. జిల్లా ఉద్యాన అధికారి సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం, కూరగాయల పందిళ్లు, పండ్ల తోటల పెంపకం, బిందుసేద్యం పరికరాల ఏర్పాటుకు అనేక రకాల సబ్సిడీలు ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి కృష్ణయ్య, విస్తరణ అధికారి శిరీష, ఏఈఓ అభిలా ష్, క్లస్టర్ డెవలప్‌మెంట్ కో–ఆర్డినేటర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
126 మంది
విద్యార్థులు గైర్హాజరు
వనపర్తి: జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల ప్రయోగ పరీక్షలు మూడోరోజు బుధవారం ప్రశాంతంగా కొనసాగినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 19 పరీక్ష కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షలకు 1,767 మంది విద్యార్థులకుగాను 1,697 మంది హాజరుకాగా.. 70 మంది గైర్హాజరైనట్లు చెప్పారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,569 మంది విద్యార్థులకుగాను 1,513 మంది హాజరుకాగా.. 56 మంది రాలేదన్నారు. మొత్తంగా 126 మంది విద్యార్థులు పరీక్షలకు దూరంగా ఉన్నట్లు వివరించారు. డీఐఈఓ జిల్లాకేంద్రంలోని రావూస్ జూనియర్ కళాశాల, ఖిల్లాఘనపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి పరీక్షల నిర్వహణ తీరు, ఏర్పాట్లు, రికార్డులను పరిశీలించారు. ఇద్దరు డీఈసీ సభ్యులు, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.
ఎన్నికల ఖర్చు
లెక్క చూపాల్సిందే
అమరచింత: పుర బరిలో నిలిచిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చు లెక్కను విధిగా చూపాలని ఎన్నికల వ్యయ పరిశీలకుడు యూసుఫ్ అహ్మ ద్ తెలిపారు. బుధవారం స్థానిక పుర కార్యాల య సమావేశ మందిరంలో అభ్యర్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి అభ్యర్థి రూ.5 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉందన్నారు. వీటికి సంబంధించిన ప్రతి లెక్కను రికార్డులో నమోదు చేయాలని సూచించారు. ఖర్చు చేసిన వాటికి సంబంధించిన బిల్లులు సైతం జత చేయాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో పుర కమిషనర్ నూరుల్ నదీం తదితరులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే
ఉత్తమ ఫలితాలు
వీపనగండ్ల: ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ ఉత్తమ బోధన అందించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతారని జిల్లా విద్యా ప్రత్యేక బృందం నోడల్ అధికారి కృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కల్వరాల, తూంకుంట ఉన్నత పాఠశాలలను సందర్శించిన బృందం సభ్యులు విద్యాభివృద్ధిలో ఉపాధ్యాయులు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించారు. ఉత్తమ ఫలితాల సాధనకు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా బోధన అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదులు మంచి వాతావరణంలో ఉంచడం, బోధనోపకరణాలు వినియోగించడంతో విద్యార్థులు సులభంగా విద్యను అభ్యసించగలుగుతారని వివరించారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం శ్రీనివాస్‌రెడ్డి, తనిఖీ బృందం సభ్యులు బలరాముడు, జయంత్‌రెడ్డి, వెంకటేష్, మధుసూదన్, దేవేంద్రం, కుర్మన్న, ఉపాధ్యాయులు శ్రీనివాస్, జితేందర్‌గౌడ్, మధుసూధన్‌గుప్తా, నిరంజన్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పూత దశలో పురుగు మందులు వాడొద్దు
పూత దశలో పురుగు మందులు వాడొద్దు


