మొదటిరోజు 34 నామినేషన్లు
● వనపర్తిలో అత్యధికం..
అమరచింతలో నిల్
వనపర్తిటౌన్: జిల్లాలోని ఐదు పురపాలికల్లో బుధవారం మొదటిరోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పుర కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూర్‌లో మొత్తం 34 నామినేషన్లు రాగా.. జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్‌పార్టీ నుంచి 16 మంది, బీఆర్‌ఎస్ నుంచి 8 మంది, బీజేపీ, స్వతంత్రంగా ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. అమరచింత మున్సిపాలిటీలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పెబ్బేరులో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు దూరంగా ఉండగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి 6వ వార్డు నుంచి నామినేషన్ వేశారు.
● కొత్తకోటలోని 1 వార్డులో 2, 7వ వార్డులో 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా వార్డుల నుంచి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు ఒక్కొక్క నామినేషన్ వేశారు.
● ఆత్మకూర్‌లో 4 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ నుంచి 3, బీఆర్‌ఎస్ నుంచి ఒక నామినేషన్ ఉన్నాయి.
● వనపర్తి మున్సిపాలిటీలో 25 నామినేషన్లు దాఖలు కాగా.. అందులో కాంగ్రెస్ నుంచి 11, బీఆర్‌ఎస్ నుంచి 6, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థుల నుంచి నాలుగేసి నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. 1, 2, 6, 7, 9, 10, 12, 13, 18, 21, 23, 26, 27, 28, 33వ వార్డులో ఒక్కో నామినేషన్, 16, 24, 25వ వార్డుల్లో రెండేసి నామినేషన్లు, 14వ వార్డులో నలుగురు నామినేషన్లు వేశారు. 14వ వార్డులో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి.
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్..
జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను బుధవారం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదర్శ్ సురభి తనిఖీ చేశారు. నామినేషన్ల ప్రక్రియ నిబంధనల ప్రకారం కొనసాగించాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు, నమూనా నామినేషన్ పత్రాలు, ఓటరు జాబితా అందుబాటులో ఉంచడం తదితర సౌకర్యాలు కల్పించడంతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చిన నామినేషన్లను ఎప్పటికప్పుడు స్కాన్‌చేసి టీపోల్ యాప్‌లో అప్‌లోడ్ చేసేందుకు కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకోవాలని, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగించాలని అసిస్టెంట్ ఎన్నికల అధికారి ఎన్.వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఆయన వెంట స్పెషల్ ఆఫీసర్, అదనపు కలెక్టర్ యాదయ్య, సిబ్బంది ఉన్నారు.
పురపాలికల వారీగా
దాఖలైన నామినేషన్లు..
మున్సిపాలిటీ నామినేషన్ల
సంఖ్య
వనపర్తి 25
కొత్తకోట 4
ఆత్మకూర్ 4
పెబ్బేర్ 1
అమరచింత –


