పురం.. ఫలితం
మూడంచెల భద్రత..
ఓట్ల లెక్కింపునకు మున్సిపాలిటీల వారీగా ప్రతి మూడు వార్డులకు ఒక ఆర్‌ఓ, ప్రతి వార్డుకు ముగ్గురు చొప్పున ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేటాయించారు. రెండు విడతల్లో జిల్లాలోని 80 వార్డుల లెక్కింపు పూర్తవుతుంది. 123 మంది ఓట్ల లెక్కింపు చేపట్టగా.. రిజర్వ్‌లో మరో 17 మంది ఉంటారు.
వనపర్తి: పుర ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలోని ఐదు పుర కేంద్రాల్లో పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్‌లను అక్కడే కేటాయించిన స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చగా..ఓట్ల లెక్కింపు కూడా అక్కడే చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా సీసీ కెమెరాల నిఘాలో ఓట్ల లెక్కింపు కొనసాగనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి వెల్లడించారు. మధ్యాహ్నంలోగా ఫలితాలు వెల్లడించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మొదటి విడతలో 50 శాతం వార్డుల ఓట్ల లెక్కింపు చేపట్టి వాటి ఫలితాల వెల్లడి పూర్తయ్యాక మిగతా వార్డుల ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ప్రతి వార్డుకు రెండు నుంచి మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో ఆయా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను బయటకు తీసి గుర్తుల వారీగా 25 చొప్పున కట్టలు చేసి ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తారు.
నేడు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
జిల్లాలోని పురపాలికల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 850 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో మూడంచెల భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ సునీతరెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. క్యూఆర్‌టీ, డాగ్ స్క్వాడ్, బాంబు డిస్పోజల్ టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని.. నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన
అధికార యంత్రాంగం
పర్యవేక్షించిన కలెక్టర్ ఆదర్శ్ సురభి
వార్డుకు ముగ్గురు చొప్పున
150 మంది లెక్కింపు సిబ్బంది
850 మందితో పోలీసు బందోబస్తు
ప్రతి మూడు వార్డులకు ఒక ఆర్‌ఓ
మొదటి రౌండ్‌లో 50 శాతం వార్డులు.. మిగతావి రెండోరౌండ్‌లో...


