యంత్రాంగం సన్నద్ధం
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
● ఇప్పటికే అధికారుల నియామకం పూర్తి
● జిల్లాలో 15 సమస్యాత్మకపోలింగ్ కేంద్రాల గుర్తింపు
● ప్రతి కేంద్రంలో వెబ్ కాస్టింగ్
●
అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఎన్నికలను పకడ్బందీగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం. ఎన్నికల ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. పోలింగ్‌కు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటువేయడమే లక్ష్యం.
– యాదయ్య, అసిస్టెంట్ ఎన్నికల అధికారి
వనపర్తిటౌన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అధికార యంత్రాగం సన్నద్ధమవుతోంది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఇదివరకే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అధికారుల నియామకాన్ని పూర్తిచేశారు. ఇప్పటికే ఫ్లైయింగ్ స్క్వాడ్స్ బృందాలు విధుల్లో నిమగ్నం కాగా.. తాజాగా రూట్ అధికారుల గుర్తింపు ప్రక్రియ పూర్తిచేశారు.
పోలింగ్ సామగ్రి సిద్ధం..
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 90 రకాల వస్తువులు అవసరం కాగా.. వాటిని ప్రత్యేకంగా గుర్తించిన రంగు సంచుల్లో నింపి సిబ్బందికి పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సులను ఇదివరకే సర్వీసింగ్ చేసినప్పటికీ.. పోలింగ్ రోజున మొరాయించకుండా మరోసారి సర్వీసింగ్ పూర్తిచేశారు. పోలింగ్‌కు ఒకరోజు ముందే సంబంధిత సిబ్బంది విధుల్లో చేరనున్నారు. ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, నోడల్ అధికారులు, ఆర్‌ఓల పర్యవేక్షణలో వారు విధులు నిర్వహించనున్నారు.
జిల్లాలో 1,17,441 మంది ఓటర్లు..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 117,441 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వనపర్తిలో 64,190, కొత్తకోటలో 18,192, పెబ్బేరులో 14,333, ఆత్మకూర్‌లో 11,579, అమరచింతలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాలో పోలింగ్ కేంద్రాల సంఖ్యకు అనుగుణంగా ప్రత్యేకంగా రూట్‌లు ఏర్పాటుచేశారు. ప్రతి రూట్‌కు ఒక జోనల్ అధికారి, మున్సిపాలిటీ నుంచి మరో అధికారిని నియమించారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి, సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం.. ఓటింగ్ అనంతరం తిరిగి లెక్కింపు కేంద్రాలకు తీసుకురావడం తదితర విధులు నిర్వర్తిస్తారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో పీఓ, ఏపీఓ, ముగ్గురు అదనపు పోలింగ్ అధికారులు, ఒక కానిస్టేబుల్, ఒక ఏఎన్‌ఎం, ఒక బీఎల్‌ఓ విధులు నిర్వర్తించనున్నారు. వనపర్తిలో 6, కొత్తకోటలో 4, పెబ్బేరులో 4, ఆత్మకూర్‌లో 3, అమరచింతలో 3 చొప్పున రూట్‌లను ఏర్పాటుచేశారు. రూట్‌లకు అనుగుణంగా అధికారుల నియమాకం పూర్తిచేశారు.
మున్సిపాలిటీ పీఓలు ఏపీఓలు రూట్‌లు/ బ్యాలెట్ అదనపు
అధికారులు బాక్స్‌లు సిబ్బంది
వనపర్తి 99 99 6 99 297
కొత్తకోట 30 30 4 30 90
పెబ్బేరు 24 24 4 24 72
ఆత్మకూర్ 20 20 3 20 54
అమరచింత 18 18 3 18 60
రిజర్వాయర్‌కు సరైన అనుమతులు లేకపోవడంతో తాము జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)ని ఆశ్రయించామని రైతులు రఘుమారెడ్డి, సుందర్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, తిరుపతయ్య తెలిపారు. దీనిపై రిజర్వాయర్‌కు అవసరమైన అనుమతులు లేనిదే పనులు చేపట్టవద్దని ఎన్జీటీ రాష్ట్ర ప్రభుత్వానికి రెండురోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీని ప్రకారం రిజర్వాయర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రతులు, వినతిపత్రాన్ని అధికారులకు అందజేశారు. దినిని ఉన్నతాధికారులకు నివేధించడంతో పాటు గ్రామసభలో రైతులు వ్యక్త పరిచిన ఆంశాలను తెలుపనున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల నియామకం ఇలా..
జిల్లావ్యాప్తంగా
20 రూట్‌లు..
నిఘా నీడలో..
జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 191 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. వీటిలో 15 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ప్రతి కేంద్రంలో వెబ్ కాాస్టింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అన్ని కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ చేయనున్నారు.


