రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి

Feb 17 2026 9:02 AM | Updated on Feb 17 2026 9:02 AM

రాష్ట

రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి

వనపర్తి: రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో జోగుళాంబ జోన్‌–7 క్రీడాకారులు ప్రతిభకనబరిచి సత్తా చాటాలని డీఎస్పీ వెంకటేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలకు వనపర్తి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు చెందిన 122 మంది క్రీడాకారులు ఎంపికయ్యారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సునీతారెడ్డి ఆదేశాల మేరకు డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ, వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు క్రీడాకారులకు ప్రేరణాత్మక సందేశం అందించి ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి క్రీడలు పోలీస్‌శాఖ ప్రతిష్టకు ప్రతీక అని అన్నారు. క్రీడల్లో ఉత్తమ ప్రతిభకనబరచి జోన్‌–7 గౌరవాన్ని నిలబెట్టాలని సూచించారు. క్రీడాస్ఫూర్తే అసలైన గుర్తింపు కావాలని.. క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాలనే సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. అనంతరం రాష్ట్రస్థాయి పోలీస్‌ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారుల బస్సులను వారు జెండా ఊపి పంపించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాస్‌, రిజర్వు ఎస్‌ఐలు వినోద్‌, సురేందర్‌ పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి 1
1/2

రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి

రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి 2
2/2

రాష్ట్రస్థాయి పోలీసు క్రీడల్లో ప్రతిభ చాటాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement