ప్రశాంతంగా ప్రయోగ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం విద్యార్థుల ప్రయోగ పరీక్షలు రెండోరోజు మంగళవారం ప్రశాంతంగా కొనసాగినట్టు డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. మొత్తం 19 పరీక్షా కేంద్రాల్లో ఉదయం జరిగిన పరీక్షలకు 2,008 మంది విద్యార్థులకుగాను 1,925 మంది హాజరుకాగా.. 83 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలకు 1,619 మంది విద్యార్థులకుగాను 1,556 మంది హాజరుకాగా.. 63 మంది రాలేదని వివరించారు. మొత్తంగా 3,481 మంది విద్యార్థులు హాజరు కాగా 146 మంది గైర్హాజరయ్యారన్నారు. తనతోపాటు ఇద్దరు డీఈసీ సభ్యులు, ఇద్దరు ఫ్లయింగ్ స్క్వాడ్లు కేంద్రాలను తనిఖీ చేశామని చెప్పారు. పరీక్షల నిర్వహణ తీరు, ఏర్పాట్లు, రికార్డులను పరిశీలించినట్లు తెలిపారు.


