రెండోవిడత ఆడిట్ పూర్తి
వనపర్తిటౌన్: పుర ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయంపై రెండోవిడత రిజిస్టర్ ఆడిట్ శనివారం జిల్లాకేంద్రంలోని పుర కార్యాలయంలో వ్యయ పరిశీలకుడు నర్సింహారెడ్డి చేపట్టారు. నామినేషన్ పత్రాల దాఖలు నుంచి ఇప్పటి వరకు అభ్య ర్థులు చేసిన ఖర్చు వివరాలను ఒక్కొక్కటిగా నమోదు చేయించి అవి ఎన్నికల సంఘం సూచించి న నిబంధనలకు లోబడి ఉన్నాయా లేవా అని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు పూర్తయ్యేలోపు మూడుసార్లు ఆడిట్ ఉండగా.. ఇప్పటి వరకు రెండు పూర్తయ్యాయని, ఈ నెల 9న మరోసారి ఆడిట్ చేస్తామని చెప్పారు.


