‘బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు’
వనపర్తి రూరల్: తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించి సంక్షేమ పథకాల అమలులో కేసీఆర్ చరిత్ర సృష్టించారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. గురువారం పుర కేంద్రంలోని 1, 3, 4, 5, 6 వార్డుల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ఎద్దుల కరుణశ్రీ, శంకర్‌నాయుడు, పవిత్ర, వడ్డె అనురాధ, గోపిబాబు తరఫున విసృత్త ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర పాలకుల వెక్కిలి చేష్టలు, అవమానాలు భరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కొనియాడారు. కాంగ్రెస్‌పార్టీ మహిళలకు రూ.2,500, తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, యువతులకు స్కూటీలు, వరి ధాన్యానికి బోనస్, రాయితీపై వంట గ్యాస్, రైతు భరోసా, పంట రుణమాఫీ, రైతుబీమా పెంచుతామని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను నట్టేట ముంచారని విమర్శించారు. పెబ్బేరులో నీతివంతమైన పాలన అందించామని, రహదారి విస్తరణ, అంతర్గత రహదారులు, క్రీడా మైదానం, నిరంతరం విద్యుత్ సరఫరా, శుద్ధజలం అందించామని చెప్పారు. సుపరిపాలన కావాలంటే బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు లక్ష్మారెడ్డి, కర్రె స్వామి, దిలీప్‌రెడ్డి, వనం రాములు రాజశేఖర్, వడ్డె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ఎదుట
న్యాయవాదుల నిరసన
ఆత్మకూర్: రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా పట్టణ కోర్టు ఆవరణలో గురువారం న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. దాడులకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని కళాళాలలకు సంబంధించి డిగ్రీ 1, 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్ష ఫలితాలను గురువారం పీయూ వీసీ జి.ఎన్.శ్రీనివాస్ వెల్లడించారు. ఇందులో భాగంగా సెమిస్టర్–1లో 30.08 శాతం, 3లో 39.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ఆయన పేర్కొన్నారు. పీయూ పరిపాలన భవనంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పి.రమేష్‌బాబు, పరీక్షల నియంత్రణ అధికారి డా.కె.ప్రవీణ, ఎగ్జామినేషన్ కో–ఆర్డినేటర్ డా.అరుంధతిరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ గౌతం పాల్గొన్నారు.
‘బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు’
‘బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి పరుగులు’


