తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం

Feb 10 2026 7:17 AM | Updated on Feb 10 2026 7:17 AM

తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం

తెలుగు జాతి సంస్కృతిని కాపాడుకుందాం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: తెలుగు జాతి సంస్కృతిలో భాగమైన నాటక రంగాన్ని కాపాడుకుందామని రాష్ట్ర సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌ అన్నారు. మన్యంకొండ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీమిత్ర కళానాట్య మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు సోమవారం మూడో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటక కళారంగాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. మండలి ప్రధాన కార్యదర్శి వి.నారాయణ మాట్లాడుతూ 11 ఏళ్ల నుంచి తమ సంస్థ ఆధ్వర్యంలో మన్యంకొండ క్షేత్రంలో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.వివిధ సంస్థలచే శ్రీరామాంజనేయ యుద్ధ సన్నివేశం, భవాని చింతామణి, సుభద్ర అర్జున సీను, కర్ణ రహస్యం సీను, రావణబ్రహ్మ ఏకపాత్రాభినయం నిర్వహించారు. అనంతరం కళాకారులను సన్మానించిన సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్‌ కళాకారుడు కె.శివప్రసాద్‌, బంగారు వెంకటయ్య, భాస్కరాచారి, ధర్మన్న, నాగరాజు, వెంకటయ్య, విజయదేవి, శివ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement