హైలెవల్‌.. ముందడుగు | - | Sakshi
Sakshi News home page

హైలెవల్‌.. ముందడుగు

Jan 11 2026 7:05 AM | Updated on Jan 11 2026 9:59 AM

హైలెవ

హైలెవల్‌.. ముందడుగు

సీఎంకి రుణపడి ఉంటాం.. మంత్రి కృషితోనే.. సందడిగా మారింది..

రూ.123 కోట్లతో..

22 కిలోమీటర్ల మేర..

రెండేళ్లలో నిర్మాణం పూర్తి..

జూరాల వద్ద ప్రారంభమైన వంతెన నిర్మాణం

రూ.123 కోట్ల అంచనా వ్యయంతో..

తాత్కాలిక రోడ్డు ఏర్పాటు..

కొనసాగుతున్న రాకపోకలు

ఆత్మకూర్‌, గద్వాల మధ్య తగ్గనున్న దూరం

ఆనందం వ్యక్తం చేస్తున్న

ప్రాంతవాసులు

గద్వాల మండలం కొత్తపల్లి, ఆత్మకూర్‌ మండలం కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నా. ప్రస్తుతం నిర్మాణానికి అడుగులు పడగా.. తాత్కాలిక రోడ్డు పనులు పూర్తయి గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఏళ్లనాటి కలను సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం.

– మహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌, కొత్తపల్లి (గద్వాల)

మండలంలోని జూరాల వద్ద కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి ఎంతో శ్రమించారు. కొందరు కావాలని అడ్డంకులు సృష్టించి ఇబ్బందులకు గురిచేసినా సీఎంను ఒప్పించి రూ.123 కోట్లు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు.

– పరమేష్‌, కాంగ్రెస్‌పార్టీ

మండల అధ్యక్షుడు, ఆత్మకూర్‌

మా ఊరి మీదుగా ఆత్మకూర్‌, గద్వాలకు వాహనాలు తిరుగుతుంటే సందడిగా మారింది. గతంలో మా గ్రామంవైపు కన్నెత్తి చూడనివారు సైతం ఊరి మీదుగా ప్రయాణం చేస్తున్నారు. ఊరి రూపురేఖలు మారడం ఖాయం.

– నర్సింహ, సర్పంచ్‌, జూరాల (ఆత్మకూర్‌)

ఆత్మకూర్‌: ఈ ప్రాంతవాసుల ఏళ్ల నాటి కల సాకారం కాబోతుంది. మండలంలోని జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి మధ్యనున్న కృష్ణానదిపై హై లేవల్‌ వంతెన నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల మధ్య తాత్కాలిక రోడ్డు నిర్మించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు రాకపోకలు సాగిస్తున్నాయి. రూ.123 కోట్లతో హై లేవల్‌ వంతెన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిసెంబర్‌ 1న శంకుస్థాపన చేశారు. వెంటనే తాత్కాలిక రోడ్డు నిర్మాణం చేపట్టి రాకపోకలు ప్రారంభించారు.

త్మకూర్‌ నుంచి జూరాల మీదుగా గద్వాలకు వెళ్లాలంటే 32 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం పూర్తయితే కేవలం పది కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. అలాగే గద్వాల నుంచి హైదరాబాద్‌కు వెళ్లాలంటే ఎర్రవల్లి చౌరస్తా మీదుగా హైవేపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వంతెన నిర్మాణం అనంతరం గద్వాల నుంచి ఆత్మకూర్‌ మీదుగా కొత్తకోట హైవేకు చేరుకోవచ్చు. దీంతో 40 కిలోమీటర్ల దూరం తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎమ్మిగనూరు, ఆదోని, బళ్లారి, మంత్రాలయం వెళ్లే ప్రయాణికులకు దూరభారం తగ్గనుంది. రవాణా సౌకర్యం మెరుగుపడటంతో వ్యాపారపరంగా ఆత్మకూర్‌, జూరాల, గద్వాల జిల్లా కొత్తపల్లి ప్రాంతాలు అభివృద్ధి చెందనున్నాయి.

కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ.123 కోట్లు కేటాయించడంతో ఆర్‌అండ్‌బీశాఖ టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. గత నెలలోనే పనులను ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించగా.. మంత్రి వాకిటి శ్రీహరి త్వరతగతిన నిర్మాణం పూసేందుకు సంబంధిత కాంట్రాక్టు కంపెనీ, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడుతున్నారు.

కృష్ణానదిపై హైలేవల్‌ వంతెన నిర్మాణ పనులు రెండేళ్లలోపు పూర్తిచేసేలా ముందుకు సాగుతున్నాం. ఇందులో భాగంగా మొదట తాత్కాలిక రోడ్డు నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్ట్‌ కంపెనీ పనులు వేగంగా కొనసాగిస్తోంది.

– దేశ్యానాయక్‌, ఈఈ, ఆర్‌అండ్‌బీ

హైలెవల్‌.. ముందడుగు 1
1/3

హైలెవల్‌.. ముందడుగు

హైలెవల్‌.. ముందడుగు 2
2/3

హైలెవల్‌.. ముందడుగు

హైలెవల్‌.. ముందడుగు 3
3/3

హైలెవల్‌.. ముందడుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement