ఆర్టీసీకి పండుగే..
● సంక్రాంతి వేళ..
పెరిగిన ప్రయాణికుల రద్దీ
● హైదరాబాద్‌కు 18..
కర్నూలుకు ఆరు అదనపు ట్రిప్పులు
వనపర్తిటౌన్: సంక్రాంతి సెలవులు ఆరంభం కావడంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కొత్తకోట, ఆత్మకూర్‌తో పాటు హైదరాబాద్, కర్నూలుకు అదనపు ట్రిప్పులను ఆర్టీసీ నడుపుతోంది. సాధారణంగా హైదరాబాద్‌కు రోజు 50 ట్రిప్పులు నడిపేవారు. ఈ మార్గంలోనే అత్యధిక ఆదాయం రానున్నందున మరో 18 ట్రిప్పులు నడుపుతున్నారు. పండుగ రోజుల్లో ప్రతి పది నిమిషాలకు ఓ బస్సును అందుబాటులో ఉంచారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ సంఖ్యను మరింత పెంచే ఆలోచనలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కర్నూలుకు రోజు ఆరు ట్రిప్పులు నడవనుండగా.. అదనంగా మరో ఆరు నడిపేందుకు సిద్ధమయ్యారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్ ప్రతేక్యంగా సిబ్బందిని బస్టాండ్‌లో నియమించి సర్వీసుల రాకపోకలను పర్యవేక్షిస్తున్నారు.
ఆర్టీసీకి పండుగే..


