చట్టాలపై అవగాహనతోనే సత్వర న్యాయం
వీపనగండ్ల: చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంటేనే సత్వర న్యాయం పొందే అవకాశం ఉందని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి రజని అన్నారు. బాల్యవివాహ ముక్త్ భారత్‌లో భాగంగా గురువారం మండలంలోని గోవర్ధనగిరిలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. యువత, విద్యార్థులు మత్తుకు దూరంగా ఉండాలని.. భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు, ఎస్‌ఐ రాణి, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


