25 నుంచి ఐద్వా మహాసభలు
పాన్‌గల్: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ఐద్వా ఆలిండియా మహాసభలు జరగనున్నాయని.. మహిళలు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం జిల్లా అధ్యక్షురాలు సాయిలీల కోరారు. గురువారం ఆమె మండల కేంద్రంలో మహాసభల వాల్‌పోస్టర్లను సంఘం నాయకులతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై మహాసభలో చర్చించనున్నట్లు తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్ష వంటి అంశాలపై సంఘం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు మాధవి, ఇందిర, మహిళలు పాల్గొన్నారు.


