అతివకే అవకాశం
రెండు దశాబ్దాల తర్వాత..
● కొత్తకోట పుర పీఠం బీసీ మహిళకు కేటాయించడంతో ఆశావహులు కొందరు ఆశలు వదులుకోగా.. మరికొందరు తమ సతీమణులను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇద్దరి మఽ ద్యలో పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.
● పెబ్బేరు పురపాలిక జనరల్‌కు కేటాయించగా రెండు ప్రధాన పార్టీల్లో ఇద్దరేసి నాయకులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇందులో ఓ మాజీ ప్రజాప్రతినిధి ఉన్నట్లు తెలుస్తోంది.
● అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీలు జనరల్‌కు కేటాయించడంతో రాజకీయం వేడెక్కింది.
● తీవ్ర నిరాశలో ఆశావహులు
● సతులను రంగంలోకి దింపేందుకు పతుల పాట్లు
కొత్తకోట సమీపంలో హైదరాబాద్ బైపాస్ రహదారిపై బ్లాక్‌స్పాట్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ సునీతరెడ్డి
వనపర్తి టౌన్: స్థానిక పుర పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. అధికార కాంగ్రెస్‌పార్టీలో ఎన్నికల ప్రకటన వెలువడక ముందే రాజకీయాలు రసవత్తరంగా మారాయి. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా.. వనపర్తి, కొత్తకోటలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అధికార కాంగ్రెస్‌పార్టీలోని పలువురు ఆశావహులు రెండేళ్లుగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. చైర్మన్ బరిలో ఐదారుగురి పేర్లు ఉన్నట్లు ప్రచారంలో ఉన్నా.. అందులో ఇద్దరు, ముగ్గురి పేర్లు అధికంగా వినిపించాయి. పుర చైర్మన్ రేసులో ఉన్న నాయకులు తమ సతులను ఒప్పించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. రాజకీయాలపై అవగాహన లేని వారిని సైతం బరిలో నిలబెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. వనపర్తి మున్సిపాలిటీ 9 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండటం, ఆర్థికంగా బలంగా ఉన్న పురపాలికగా పేరుండటం తదితర పరిణామాల నేపథ్యంలో పీఠం చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
వనపర్తిలో సరిగ్గా 21 ఏళ్ల తర్వాత పుర పీఠం మళ్లీ జనరల్ మహిళకే దక్కనుంది. 2000, మార్చి నెలలో జనరల్ మహిళ రిజర్వేషన్‌లో భాగంగా నాటి టీడీపీ ప్రభుత్వ హయంలో ప్రమీలమ్మ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి, అంతకుముందు కూడా పురుషులే పుర చైర్మన్లుగా పనిచేశారు. ప్రస్తుతం జనరల్ మహిళకు కేటాయించడంతో చైర్‌పర్సన్ బరిలో ఎవరు ఉంటారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆశావహులు తమ సతీమణులను బరిలోకి దింపుతారా, లేక కొత్తవారికి కౌన్సిలర్‌గా అవకాశం ఇస్తారా? లేక ఇప్పటికే పార్టీలో ఉన్న మహిళా నాయకులకు ప్రాధాన్యం ఇస్తారా?, ఏ సామాజిక వర్గం అభ్యర్థిని చైర్‌పర్సన్‌గా ఎంపిక చేస్తారనేది ఉత్కంఠంగా మారింది. ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీల నుంచి చైర్మన్ పదవులు ఎవరికీ దక్కలేదు. ఆయా వర్గాలకు ఇస్తారా? లేక బీసీ వర్గానికి ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
అతివకే అవకాశం


