వడ్డీ చెల్లించాలంటూ వత్తిడి..
అమరచింత యూనియన్ బ్యాంక్‌లో రూ.75 వేల చేనేత రుణం తీసుకున్నా. ఏటా వడ్డీ చెల్లిస్తూ రుణాన్ని పునరుద్ధరించుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేనేత రుణమాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడంతో చెల్లించలేదు. ఇప్పుడు ఏడాది అవుతుందని.. వడ్డీ చెల్లించి పునరుద్ధరించుకోవాలని మేనేజర్ వత్తిడి చేస్తున్నారు. డబ్బులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాం.
– కొంకతి శకుంతలమ్మ,
చేనేత కార్మికురాలు, అమరచింత
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీపై ప్రకటన చేసి ఏడాదిన్నర గడుస్తున్నా.. నేటికీ సగం నిధులు మాత్రమే మంజూరు చేసింది. వాటిని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న చేనేత కార్మికులపై బ్యాంకు మేనేజర్ వేధింపులు అధికమవుతున్నాయి. ప్రభుత్వం త్వరగా రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసి నేతన్నలను ఆదుకోవాలి.
– వగ్గు రామలింగం, ఉపాధ్యక్షుడు,
చేనేత సహకార సంఘం, అమరచింత
వడ్డీ చెల్లించాలంటూ వత్తిడి..


