పిల్లలను విధిగా కళాశాలకు పంపించాలి
వనపర్తి రూరల్: తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా కళాశాలకు పంపించాలని డీఐఈఓ ఎర్ర అంజయ్య కోరారు. శుక్రవారం శ్రీరంగాపురం, పెబ్బేరు జూనియర్ కళాశాలల్లో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ అధ్యక్షతన జరిగిన విద్యార్థులు, తల్లిదండ్రుల సమావేశాలకు ఆయనతో పాటు తహసీల్దార్లు రాజు, మురళీగౌడ్, ఎంపీడీఓ రవినారాయణ, ఎస్‌ఐ హిమబిందు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పిల్లల ప్రవర్తనను నిత్యం గమనిస్తూ ఉండాలని, పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధ్యాపకులతో చర్చించాలన్నారు.


