నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
వనపర్తి: పోలీస్ ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహిరించే పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సునీతరెడ్డి హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఎస్పీ సునీతారెడ్డి హాజరై వివిధ ప్రాంతాల నుంచి 10 మందితో ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఆయా పోలీస్‌స్టేషన్లకు బదిలీ చేశామని తెలిపారు. అక్కడి సిబ్బంది ఫిర్యాదులపై వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.


