అభివృద్ధి వైపు అడుగులు
‘పుర’ ఎన్నికల వేళ పనులకు శ్రీకారం చుట్టిన అధికారులు
ఒక్కో వార్డుకు
రూ.56 లక్షలకు పైగా..
ప్రాధాన్యత ఆధారంగా ఒక్కో వార్డుకు రూ.56 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చుచేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సగటున ఒక్కో వార్డుకు రూ.56 లక్షల చొప్పున ఖర్చు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. అవసరాలు, అవకాశాల ఆధారంగా నిధులను పెంచే అవకాశం ఉంది.
మౌలిక వసతుల కల్పనకు..
పురపాలికలో వీధిదీపాలు లేని ప్రతి కాలనీలో ఏర్పాటు చేస్తాం. ఇందుకోసం రూ.10 లక్షలు వెచ్చించి 500కు పైగా ఎల్‌ఈడీ బల్బుబు తెప్పించాం. సిబ్బంది హైమాస్ట్ లైట్ల మరమ్మతుకు నిచ్చెన ఉపయోగిస్తున్నట్లు తెలిసింది. అలాగాకుండా క్రేన్ సాయంతోనే పనులు చేసేలా చూస్తాం. యూఐడీఎఫ్ నిధులు మంజూరైతే టెండర్లు పిలిచి ప్రతి వార్డులో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
– యూనుస్, డీఈ, వనపర్తి పురపాలిక
వనపర్తి టౌన్: పుర ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక పురపాలికలో హస్తం పార్టీ పట్టు సాధించేందుకు ప్రకటన వెలువడక ముందే అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. శివారు ప్రాంత కాలనీల్లో ఎక్కడ వీధి దీపాలు లేకపోవడంతో అంధకారం నెలకొంది. కలెక్టర్, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు ఆయా కాలనీల్లో వెలుగులు నింపేందుకు సుమారు 500కు పైగా కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. మరో ఐదు రోజుల్లో రూ.10 లక్షలు వెచ్చించి ఆయా స్తంభాలకు వీధి దీపాలు బిగించనున్నారు. వీటికితోడు ప్రధాన కూడళ్లలో ఏర్పాటుచేసిన 45కు పైగా హైమాస్ట్ లైట్లు వెలగడం లేదని సిబ్బంది గుర్తించారు. వీటి మరమ్మతులకు మంగళవారం నుంచి శ్రీకారం చుట్టారు.
ప్రమాదకరంగా మరమ్మతు..
10 నుంచి 15 మీటర్ల ఎత్తున్న హైమాస్ట్ స్తంభాలకు సగం మేర నిచ్చెనలు వేసుకొని సిబ్బంది మరమ్మతు చేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా కిందపడే ప్రమాదం ఉంది. గతంలో క్రేన్ సాయంతో పనులు చేపట్టే వారు. అందుకు విరుద్ధంగా చేపడుతుండటంతో అధికార యంత్రాంగంపై పుర ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.
రూ.18.70 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రహదారుల నిర్మాణానికి నిర్ణయం
సాంకేతిక అనుమతులకు ఉన్నతాధికారులకు చేరిన దస్త్రం
ఆమోదం లభించగానే టెండర్ ప్రక్రియ షురూ
రూ.10 లక్షలతో
వీధిదీపాల ఏర్పాటు
అభివృద్ధి వైపు అడుగులు
అభివృద్ధి వైపు అడుగులు
అభివృద్ధి వైపు అడుగులు


