ఐదురోజుల పని విధానం అమలు చేయాలి
వనపర్తిటౌన్: ఐబీసీ ప్రతిపాదించిన వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రతినిధులు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్ చౌక్‌లో ఉన్న ఎస్‌బీఎన్ మెయిన్ బ్రాంచ్ ఎదుట ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదురోజుల పని విధానం అమలుచేస్తే రోజు 40 నిమిషాలు అదనంగా ఖాతాదారులకు సేవలందించ వచ్చన్నారు. అంతకుముందు బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యూఎఫ్‌బీయూ సభ్యులు, బ్యాంకు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


