ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలి
వనపర్తి: పుర ఎన్నికల ప్రచార పోస్టర్లు, కరపత్రాల ముద్రణలో ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రచార సామగ్రి అయిన వాల్‌పోస్టర్లు, కరపత్రాల్లో కులం, మతపరమైన అంశాలను ప్రస్తావించరాదని, వ్యక్తిగత విమర్శలు లేకుండా చూసుకోవాలన్నారు. పబ్లిషర్ నుంచి ఫారం–ఏలో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఏ, బీతో పాటు ముద్రించిన రెండు కరపత్రాలను జతపర్చి కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. ముద్రించిన కరపత్రం లేదా గోడపత్రికపై ప్రింటింగ్‌ప్రెస్ పేరు, చిరునామా కచ్చితంగా పేర్కొనాలని, అంతేగాకుండా పబ్లిషర్ పేరు ఫోన్‌నంబర్ ముద్రించాలని సూచించారు. ఎన్ని పేజీలు ముద్రించారు.. అందుకు తీసుకున్న డబ్బులు ఎన్ని అనే వివరాలు ఫారం–బిలో చూయించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.


