దేశాభివృద్ధికి పాటుపడాలి
కొల్లాపూర్: స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాణకర్తల త్యాగాలు, విశేష కృషి ఫలితంగానే మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం మంత్రి మాట్లాడారు. మహనీయుల స్ఫూర్తిని కొనసాగిస్తూ.. వారి అడుగుజాడల్లో నడిచినప్పుడే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందన్నారు. రాజ్యాంగ విలువలు కాపాడుతూ ప్రతి పౌరుడు దేశాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు.
దివ్యాంగులకు
సహాయ ఉపకరణాలు
వనపర్తి రూరల్: జిల్లా మహిళా శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సోమవారం పెబ్బేరు పట్టణంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి దివ్యాంగులకు స్కూటీలు, ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీ ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 11వ వార్డు నాగులకుంటలో అమృత్ స్కీమ్ కింద రూ. 3.14 కోట్లతో పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అంతకుముందు పెద్దగూడెం తండాలో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు కొత్తకాపు శివసేనరెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్‌నాయక్, రవికిరణ్, మధుసూదన్‌రెడ్డి, ఎత్తంరవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమోదినిరెడ్డి, వైస్‌చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, రంజిత్‌కుమార్, భానుప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు అండర్–16
క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని ఎండీసీఏ మైదానంలో మంగళవారం ఉమ్మడి జిల్లా అండర్–16 క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌కార్డు, ఎస్‌ఎస్‌సీ మెమో, జననఽ ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, రెండు ఫొటోలతో మైదానంలో రిపోర్టు చేయాలని సూచించారు. ఎంపికయ్యే ఉమ్మడి జిల్లా జట్టు ఈనెల 30 నుంచి సంగారెడ్డిలో ప్రారంభమయ్యే హెచ్‌సీఏ అండర్–16 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్‌లో పాల్గొంటుందని ఆయన తెలిపారు.
దేశాభివృద్ధికి పాటుపడాలి


