రూ.5 లక్షల వ్యయంతో..
సుమారు రూ.5 లక్షలతో జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ షట్టర్ల మరమ్మతుతో పాటు రబ్బర్ల బిగింపు పనులు మూడేళ్ల కిందట చేపట్టారు. సదరు కాంట్రాక్టర్ రెండేళ్ల పాటు పనులు చేపట్టగా షట్టర్ల మరమ్మతు పూర్తయిందని చేతులు దులుపుకొన్న అధికారులు లీకేజీలు ఎందుకు ఏర్పడ్డాయన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. షట్టర్లకు చిన్నపాటి కప్లింగ్ జాయింట్ బోల్ట్‌ను బిగిస్తే నీటి వృథాను నిలువరించవచ్చని అధికారులకు తెలిసినా నేటి వరకు ఆ పనులు చేపట్టడం లేదు. చిన్న బోల్ట్ బిగించాలని.. అదికూడా కార్యాలయంలో ఉందని త్వరలోనే బిగిస్తామని చెప్పడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి నీటిలీకేజీ నివారణకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


