జీవిత అనుభవమే అసలైన జ్ఞానం
వనపర్తిటౌన్: అక్షర జ్ఞానం కంటే జీవిత అనుభవం చదివిన వారే అసలైన జ్ఞానులని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రముఖ సామాజికవేత్త గంధం చిన్నబాలయ్య సంస్మరణ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యులందరు జ్ఞానవంతులు కాదని, నిరక్షరాస్యులందరూ గొప్ప జ్ఞానవంతులు అయ్యేందుకు వారి జీవిత పాఠాలే నిదర్శనమని పేర్కొన్నారు. సామాజిక, అధ్యాత్మిక, విద్య, సేవాపరంగా ఇతరులకు సాయం చేసేందుకు చిన్నబాలయ్య ముందుండే వారని కొనియాడారు. చదువుకోలేదని నిరాశ చెందకుండా ఎందరినో అక్షర జ్ఞానులు చేసేందుకు తనవంతు కృషి చేశారని, దళితజాతికే కాకుండా సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. జిల్లాకేంద్రంలో అంబేడ్కర్ విగ్రహాన్ని దశాబ్దాల కిందటే నిర్ణయించి ప్రతిష్టించారని గుర్తుచేశారు. కార్యక్రమంలో వైద్యులు డా. మురళీధర్, డా. రాఘవులు, డా. భగవంతు, సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు శంకర్‌గౌడ్, వెంకట్రావు, మాణిక్యం, నాయకులు గంధం పరంజ్యోతి, చిట్యాల రాము, జనజ్వాల, రాధాకృష్ణ, పుట్టా ఆంజనేయులు, జోగు శాంతన్న, డప్పు స్వామి, గులాం ఖాదర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన
సీఐ సుగంధ రత్నం
వనపర్తి: వనపర్తి సీఐగా కె.సుగంధ రత్నం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ విధులు నిర్వర్తిస్తానన్నారు. ప్రజల సహకారం అత్యంత అవసరమని, పోలీసులు, ప్రజల మధ్య సమన్వయం ఉంటేనే నేరాలు నియంత్రించవచ్చని చెప్పారు. ప్రశాంత వనపర్తిగా రూపొందించేందుకు సిబ్బంది సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా రత్నం మహబూబ్‌నగర్ సీసీఎస్‌లో సీఐగా విధులు నిర్వర్తిస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ కృష్ణయ్య డీఐజీ కార్యాలయానికి వెళ్లారు.
పార్టీలకు అతీతంగా
అభివృద్ధి సాధించాలి
వనపర్తిటౌన్: సర్పంచ్‌లు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో కొత్తకోట, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, మదనాపురం, అమరచింత, ఆత్మకూర్, గోపాల్‌పేట మండలాల పరిధిలోని 133 మంది సర్పంచ్‌ల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టే ప్రతి పనిలో వార్డు సభ్యులను భాగస్వాములు చేయాలని సూచించారు. స్వచ్ఛత, తాగునీరు, వీధి దీపాలు, మురుగు, విద్యుత్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. గ్రామస్థాయిలోని ఆరోగ్య కేంద్రాల్లో ఔషదాల నిల్వలు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్‌లదేనని చెప్పారు. గ్రామాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి స్థల సేకరణ చేయాలని, భవనాలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాల్లో చేసే సేవ ప్రతి ఒక్కరు అభినందించేలా, జీవితంలో గుర్తుండిపోయేలా ఉండాలని కోరారు. రెండోవిడత శిక్షణకు మిగతా గ్రామాల సర్పంచులు హాజరవుతారని పేర్కొన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసిన సర్పంచులకు ఎమ్మెల్యే ధ్రువపత్రాలు అందజేశారు.
జీవిత అనుభవమే అసలైన జ్ఞానం
జీవిత అనుభవమే అసలైన జ్ఞానం


