ఉత్సాహంగా అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు
వనపర్తి రూరల్: పెబ్బేరులోని చెలిమిల్ల కిష్టారెడ్డిపేటలో వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఆలయ కమిటీ సభ్యులు అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో చెలిమిల్లకు చెందిన కంచె తిరుపతయ్య వృషభాలు మొదటి స్థానంలో నిలవగా దాత గార్లపాటి శంకరయ్య రూ.40 వేల నగదు అందజేశారు. అదే గ్రామానికి చెందిన కంచె రాముడు ఎద్దులు రెండోస్థానంలో నిలవగా రూ.30 వేలు.. కర్నూలు జిల్లా కోడుమూరుకు చెందిన డీఆర్కే బుల్స్ శశాంక్ ఎద్దులు మూడోస్థానంలో నిలవగా రూ.20 వేలు.. ఇటిక్యాల మండలం బుడ్డారెడ్డిపల్లికి చెందిన చిన్న శివన్న ఎద్దులు నాలుగో స్థానంలో నిలిచి రూ.15 వేలు.. వడ్డెమాన్‌కు చెందిన ఆంజనేయరెడ్డి ఎద్దులు ఐదోస్థానంలో నిలవగా రూ.10 వేలు.. వనపర్తికి చెందిన శ్రీనివాస్ ఎద్దులు ఆరోస్థానంలో నిలవగా రూ.5 వేలు దాతలు గగనం భీముడు, గగనం హరికృష్ణ అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రామన్‌గౌడ్, కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి, నాగిరెడ్డి, నవీన్‌కుమార్‌గౌడ్, ఆంజనేయులు, మోహన్‌గౌడ్ ,రా ముడు, పరశురాముడు కార్తీక్, కుర్వ శేఖర్ పాల్గొన్నారు.


