ఎగబడి పోవాలె..!
ఉమ్మడి జిల్లాలో బస్సు సౌకర్యం లేక విద్యార్థుల అగచాట్లు
పాఠశాల, కళాశాల విద్యార్థులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్సు, ఫుట్‌బోర్డుపై ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులను ఈ దృశ్యంలో చూడవచ్చు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని ఊట్కూర్, తిప్రాస్‌పల్లి నుంచి ఈ బస్సు నారాయణపేటకు వస్తోంది. ఈ బస్సులో రద్దీ ప్రతిరోజూ సర్వసాధారణంగా మారింది.
..ఇదీ భావి భారత పౌరుల దుస్థితి. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక.. ఉన్నప్పటికీ సమయపాలన పాటించకపోవడం.. వచ్చినా ఆపకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పడుతున్న అగచాట్లకు ఈ దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కాలినడకన కొందరు.. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి వేళ్లాడుతూ మరికొందరు.. బస్సుల్లో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణం చేస్తూ ఇంకొందరు నరకయాతన అనుభవిస్తున్నారు. స్థానికంగా ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు లేకపోవడం.. రవాణా ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టడంలో పాలకుల వైఫల్యం వెరసీ విద్యార్థులు నానా ఫీట్లతో దినదినగండంగా రాకపోకలు చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరులోని పలు గ్రామాల్లో నిత్య సవాళ్ల మధ్య చదువుల యుద్ధం కొనసాగిస్తున్న విద్యార్థులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
టంకర, కిష్టారం (హన్వాడ), కొత్తపల్లి (మిడ్జిల్), రామచంద్రపూర్ (మహబూబ్‌నగర్ రూరల్)
జిల్లాలో 423 గ్రామాలు ఉన్నాయి. జిల్లాలో ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధి 45 రూట్లలో బస్సులు నడుస్తున్నాయి. నాలుగు గ్రామాలకు బస్సు సర్వీసులు లేకపోవడంతో ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. టంకర మినహాయించి మూడు గ్రామాలకు చెందిన వారు బస్సులు నడపాలని విజ్ఞప్తులు చేసినా.. అమలు కాలేదు.
జిల్లాలో మొత్తం 212 గ్రామాలు ఉన్నాయి. ఒక ఆర్టీసీ డిపో ఉండగా.. దీని పరిధిలో 189 గ్రామాలకు మాత్రమే సర్వీస్‌లు నడిపిస్తున్నారు. 23 పల్లెలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు రవాణా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని 11 గ్రామాల నుంచి అర్జీలు రాగా.. ఆరు పల్లెలకు మాత్రమే నడుపుతున్నారు.
విద్యార్థులు ఇబ్బంది పడుతున్న
గ్రామాలు..
దావాసిపల్లి (పాన్‌గల్), నగరాల (శ్రీరంగాపురం), కంభాళపూర్‌తండా (ఖిల్లాఘనపురం), చె న్నూర్ (గోపాల్‌పేట), మిరాస్‌పల్లి (కొత్తకోట).
ఫీట్లు.. పాట్లు
అనేక గ్రామాల్లో కిక్కిరిసిన ఆటోల్లోనే
పాఠశాలలకు..
కొన్నిప్రాంతాల్లో ఎడ్ల బండ్లు,
కాలినడకే శరణ్యం
నిత్యం కిలోమీటర్ల కొద్దీ ప్రమాదకర ప్రయాణం
అరకొరగా ఆర్టీసీ సర్వీస్‌లు.. సమయానికి రాక.. వచ్చినా ఆపక ఇబ్బందులు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
ఎగబడి పోవాలె..!
ఎగబడి పోవాలె..!


