సంక్రాంతి సంబురం
వనపర్తి
నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
ఊర్కొండపేట అభయాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ప్రారంభమై
ఈ నెల 23 వరకు కొనసాగనున్నాయి.
శనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026
–IIలో u
వనపర్తిటౌన్: సంక్రాంతి పండుగను జిల్లా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకొన్నారు. అందమైన రంగవల్లులతో ఇళ్ల లోగిళ్లు, డూడూ బసవన్నల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గురువారం పండుగ రోజున జిల్లాలోని ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. జిల్లాకేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి సహిత వేంకటేశ్వరస్వామివారి పల్లకీసేవ, ఆదిత్య హృదయ పారాయణం, మహా మంగళహారతి, నక్షత్ర హారతి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతల హనుమాన్ ఆలయంలో శివదీక్షదారులు శివుడిని ప్రత్యేకంగా అలంకరించి తమ ఆటపాటలతో స్తుతించారు. ప్రతి ఇంటా తీపి వంటకాలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆరగించారు. పట్టణాలు, గ్రామాల్లో సాయంత్రం వేళ చిన్నా పెద్దా తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేయడం కనిపించింది. అలాగే గ్రామాల్లో శకటాల ఊరేగింపు ప్రత్యేకంగా నిర్వహించారు. వృషభాలతో పాటు బండ్లు, ట్రాక్టర్లను రంగురంగుల కాగితాలు, కొబ్బరి, మామిడి ఆకులతో అలంకరించి వీధుల్లో తిప్పారు. శుక్రవారం కనుమ రోజున మాంసం విక్రయాలు జోరందుకున్నాయి. రోజువారి కంటే రెండింతలు విక్రయాలు జరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పండుగ సందర్భంగా గ్రామాలు, పట్టణాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమంగా వేసిన వారికి గ్రామపెద్దలు బహుమతులు అందజేశారు.
సంక్రాంతి సంబురం
సంక్రాంతి సంబురం


