ఎన్‌ఏటీఎస్ డైరెక్టర్‌గా సాయిప్రసాద్‌గౌడ్
వనపర్తిటౌన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్‌ఏటీఎస్) డైరెక్టర్‌గా జిల్లాలోని ఏదుట్లకు చెందిన డా. పలుస సాయిప్రసాద్‌గౌడ్ ఎన్నికయ్యారని సాహితి కళావేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్ శుక్రవారం తెలిపారు. ఉత్తర అమెరికాలోని కొలరాడో యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆయనను 2026–27 సంవత్సరానికిగాను ఎంపిక చేశారన్నారు. రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఉంటూ విద్య, ఉద్యోగ నిమిత్తం వచ్చే తెలుగు వారికి తనవంతు చేయూతనిస్తూ సహకరిస్తున్నారని చెప్పారు. సాయిప్రసాద్‌గౌడ్ సేవలను గుర్తించిన అక్కడి తెలుగు సంఘం ఆయనను డైరెక్టర్‌గా ఎంపిక చేశారన్నారు.


