పాలమూరు అస్త్రంగా.. | - | Sakshi
Sakshi News home page

పాలమూరు అస్త్రంగా..

Jan 17 2026 11:49 AM | Updated on Jan 17 2026 11:49 AM

పాలమూ

పాలమూరు అస్త్రంగా..

నేడు మహబూబ్‌నగర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి రాక

సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌: జిల్లాల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాకు రానున్నారు. ఈ మేరకు సుమారు రూ.1,284 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బహిరంగసభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగు నీరందించే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు పుర పాలక ఎన్నికల ప్రక్రియ వేగంగా కొనసాగుతుండగా.. ముఖ్యమంత్రి సభలో ఏం మా ట్లాడుతారోననే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రూ.883 కోట్లతో యూజీడీ, శాశ్వత తాగునీరు..

కార్పొరేషన్‌ పరిధిలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, శాశ్వత తాగునీటి సరఫరా, పైపు లైన్లు తదితర సమస్యల పరిష్కారం కోసం రూ.883 కోట్లు ఇదివరకే మంజూరైన విషయం తెలిసిందే. ఇందులో రూ.603 కోట్లతో మురుగు నీటిని నగరం బయటకు తరలించే సీవర్‌ లైన్‌ కాల్వ ఏర్పాటు చేయనున్నారు.

● నిర్మల్‌ జిల్లా బాసరలోని ట్రిపుల్‌ ఐటీకి అనుబంధంగా క్యాంపస్‌ను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. గతేడాది మేలో మంజూరు కాగా.. ఈ విద్యాసంవత్సరం నుంచే క్లాసులు ప్రారంభమయ్యాయి. ట్రిపుల్‌ ఐటీ కోసం సొంత భవనాన్ని నేషనల్‌ హైవేకు సమీపంలో ఉన్న దివిటిపల్లి–ఎదిర, జడ్చర్ల మండలం చిట్టబోయిన్పల్లి, మల్లెబోయిన్‌ పల్లి వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ 44 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో.. అక్కడ పనులు మొదలు పెట్టేందుకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపింది. ట్రిపుల్‌ ఐటీ భవనాల నిర్మాణం కోసం రూ.600 కోట్లను అవసరం కాగా.. రూ.200 కోట్ల చొప్పున మొత్తం మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేయనుంది. తాజాగా మొదటి విడత కింద రూ.200 కోట్లు మంజూరు చేయగా.. భవన నిర్మాణ పనులకు నేడు ముఖ్యమంత్రి భూమి పూజ చేయనున్నారు.

సీఎం పర్యటనపై సర్వత్రా ఆసక్తి..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతేఏడాది డిసెంబర్‌ ఒకటిన నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో పర్యటించారు. రూ.4,500 కోట్లతో చేపట్టనున్న కొడంగల్‌ – నారాయణపేట – మక్తల్‌ ఎత్తిపోతల పథకానికి భూమి పూజ చేశారు. అనంతరం సభలో త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటాయని సూచన ప్రాయంగా చెప్పారు. ఈ మేరకు రెండు రోజులకే ఎన్నికల షెడ్యుల్‌ విడుదల అయింది. ఆ తర్వాత అదే నెల డిసెంబరు 24న తన సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గికి వచ్చారు. నూతనంగా గెలుపొందిన నియోజకవర్గ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు రూ.5 లక్షలు ప్రకటించారు. తాజాగా శనివారం ఆయన మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లో పుర ఎన్నికల షెడ్యూల్‌ వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఇటీవల మహబూబ్‌నగర్‌లో పర్యటించిన క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి తీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. దీనిపై సైతం సీఎం స్పందించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఇలా..

సుమారు రూ.1,284 కోట్ల

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ట్రిపుల్‌ ఐటీ భవన నిర్మాణానికి భూమిపూజ

నగరంలోయూజీడీ, తాగునీటి పనులకు..

ఎంవీఎస్‌ మైదానంలో బహిరంగ సభ

ముఖ్యమంత్రి సభపై సర్వత్రా ఆసక్తి

పాలమూరు అస్త్రంగా.. 1
1/1

పాలమూరు అస్త్రంగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement