మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి
ఆత్మకూర్: మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాలను కై వసం చేసుకొని సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి డా.వాకిటి శ్రీహరి అన్నారు. సోమవారం మంత్రి నివాసంలో ఆత్మకూర్ మున్సిపాలిటీకి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మంత్రి సమక్షంలో హస్తం గూటికి చేరగా.. ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆత్మకూర్‌లో రూ. 3.14కోట్లతో చెరువుకట్ట సుందరీకరణ, వార్డుల్లో రూ. 15కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలు రూ. 123 కోట్లతో జూరాల హైలెవల్ బ్రిడ్జి తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని.. మరింత రెట్టింపు ఉత్సాహంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రహ్మతుల్లా, నాయకులు పరమేశ్, తులసీరాజ్, నల్లగొండ శ్రీను, కుర్ని రవికాంత్, సద్దల వెంకట్రాములు, దామోదర్, మహేశ్, అశోక్, సాయిరాఘవ, షాలం, జూబేర్, కరణ్‌లాల్ పాల్గొన్నారు.


