ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి
అమరచింత: బాలికలు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్లాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. శనివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని దేశాయి మురళీధర్‌రెడ్డి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. బాలికలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకుంటూ, తమ లక్ష్యాలను సాధించాలన్నారు. బాలికలకు న్యాయపరమైన సమస్యలు ఎదురైనప్పుడు తమ సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బాల్యవివాహ ముక్త్ భారత్‌లో భాగంగా ప్రతి ఒక్కరూ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును బాలికలు ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిక్షఖరాలను అధిరోహించాలని సూచించారు. అనంతరం బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డా.మానస వివరించారు. వివిధ క్రీడా పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఐ స్వాతి, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, దేశాయి ప్రకాశ్‌రెడ్డి సేవాసమితి అధ్యక్షుడు కలాంపాషా, హెచ్‌ఎం పద్మ, సీఆర్పీ స్వామి పాల్గొన్నారు.


