ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఉండాలి
ఖిల్లాఘనపురం: ప్రతి గ్రామంలో ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేలా చూడాలని హార్ట్‌ఫుల్‌నెస్ ధ్యాన సంస్థ మహబూబ్‌నగర్ జోనల్ అధికారి కృష్ణారావు, వనపర్తి, గద్వాల జోనల్ అధికారి లలిత కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని పద్మశాలి కల్యాణ మండపంలో హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో నూతన సర్పంచులు, ఉప సర్పంచుల సన్మాన కార్యక్రమం, 500 మీటర్లు, కిలోమీటర్, రెండు కిలోమీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా.. వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ధ్యానం చేయడంతో ఉత్తేజం, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటామని చెప్పారు. 500 మీటర్ల పరుగు పందెం బాలికల విభాగంలో నందు, స్రవంతి, నవ్య.. బాలుర విభాగంలో మహేష్, కార్తీక్, జగన్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అదేవిధంగా కిలోమీటర్ పరుగు పందెంలో బాలుర విభాగంలో శివ, ప్రవీణ్, శ్రీరాం.. బాలికల విభాగంలో చందన, శిరీష, నందిని, రెండు కిలోమీటర్ల పరుగుపందెంలో శివ, రాజేష్, శ్రీనునాయక్ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచారు. అనంతరం సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లను శాలువాలతో సన్మానించడంతో పాటు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.


