ప్రారంభమైన యూరియా కష్టాలు
● చెప్పులు, రాళ్లను
వరుసలో పెట్టిన అన్నదాతలు
● పోలీసుల పర్యవేక్షణలో టోకన్ల పంపిణీ
పాన్‌గల్: ప్రభుత్వం ఎన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చినా.. రైతులకు మాత్రం యూరియా కష్టాలు తప్పడం లేదు. తాజాగా సోమవారం అన్నదాతలు మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం ఎదుట చెప్పులు, రాళ్లను వరుసలో ఉంచడం కనిపించింది. 450 బస్తాల యూరియా వచ్చిందనే విషయం తెలుసుకున్న వివిధ గ్రామాల రైతులు ఉదయాన్నే కార్యాలయానికి చేరుకొని క్యూలైన్‌లో నిలబడటం ఇబ్బందిగా ఉండటంతో చెప్పులు, రాళ్లను వరుసలో ఉంచి వారు మాత్రం కార్యాలయం ఎదుట పడిగాపులు పడ్డారు. రైతులు ఒకరినొకరు తోసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొనగా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని రైతులను వరుసలో నిలబెట్టి ఒకరి తర్వాత ఒకరిని వదిలి బయోమెట్రిక్ విధానంలో సరఫరా చేశారు.
యూరియా కోసం వరుసలో
ఉంచిన చెప్పులు, రాళ్లు
ప్రారంభమైన యూరియా కష్టాలు


