పాలమూరుకు నీళ్లు
కేసీఆర్ వస్తేనే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ‘పాలమూరు అభివృద్ధి చెందాలంటే మళ్లీ కేసీఆరే రావాలి. ఐటీ హబ్ పునర్ వైభవం పొందాలంటే, ఉద్యోగాలు రావాలంటే, అమర్ రాజా కంపెనీ మళ్లీ రావాలన్నా, రైతులు, మహిళల ముఖాల్లో చిరునవ్వు చూడాలన్నా, భూముల ధరలు పెరగాలన్నా మళ్లీ కేసీఆర్ రావాలి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఎస్‌వీఎస్ మెడికల్ కళాశాల నుంచి ఎంబీసీ మైదానం వరకు బీఆర్‌ఎస్ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఎంబీసీ మైదానం నిర్వహించిన బీఆర్‌ఎస్ నూతన సర్పంచులు, ఉపసర్పంచుల సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొడంగల్‌తో సహా 14 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురుతుందని చెప్పారు. అభ్యర్థిగా ఎవరున్నా గులాబీ జెండాను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్
ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే..
పాలమూరు బిడ్డనంటూ
రేవంత్ గద్దెనెక్కారు
రెండేళ్లయినా ఒక్క పనీ చేయలేదు
పాలమూరు నుంచే
పుర ఎన్నికల జైత్రయాత్ర
మహబూబ్‌నగర్‌లో
సర్పంచుల సన్మాన కార్యక్రమంలో
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


