శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కీలకం
వనపర్తి: పోలీసు వృత్తిలో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ అత్యంత కీలకమని.. క్రీడలు కేవలం పోటీలకే పరిమితం కాకుండా, సిబ్బందిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి సమన్వయంతో కూడిన పనితీరును అలవరుస్తాయని ఎస్పీ సునీతరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు క్రీడా మైదానంలో జోగుళాంబ జోన్–7 జోనల్ పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్–2026 ఎంపికలను నారాయణపేట జిల్లా ఏఆర్ అదనపు ఎస్పీ రియాజ్ హుల్‌హక్‌తో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పోలీసు బలగాల శక్తి కేవలం ఆయుధాల్లోనే కాకుండా క్రీడా మైదానాల్లోనూ ప్రతిఫలిస్తుందని తెలిపారు. జోనల్ సెలక్షన్స్ ద్వారా ఎంపికై న క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటాలని, జోగుళాంబ జోన్–7 పేరు ప్రతిష్టలను మరింత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో శాసీ్త్రయంగా, నిష్పక్షపాతంగా ఎంపికలు నిర్వహించామని, క్రీడల్లో ప్రతిభ కనబర్చే ప్రతి పోలీసు యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. పోటీల్లో వనపర్తి, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది, మహిళా సిబ్బంది పాల్గొన్నారు. 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగు పందెం, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల పరుగు పందెం, కబడ్డీ, వాలీబాల్, హ్యాండ్‌బాల్, ఖో–ఖో, హైజంప్, లాంగ్‌జంప్, షాట్‌పుట్, షటిల్ తదితర 31 క్రీడల్లో మొత్తం 370 మంది పోలీసులు పోటీపడ్డారు. ప్రతిభ కనబర్చిన 90 మంది క్రీడాకారులు ఫిబ్రవరి 2 నుంచి హైదరాబాద్‌లో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్‌లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ, సీఐ కృష్ణయ్య, వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాల రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, అప్పలనాయుడు, వెంకటేష్, విజయభాస్కర్, కృషయ్య, నర్సింహ, రాఘవరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఐదు జిల్లాల ఎస్‌ఐలు, రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ సునీతరెడ్డి
శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కీలకం


