‘మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు’
కొత్తకోట రూరల్: మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని అన్నారు. సోమవారం కొత్తకోటలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల (వీపనగండ్ల)లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోటార్ వెహికల్ యాక్ట్, డ్రగ్స్ నివారణ, చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం మైనర్ల వివాహాలు చేసినా, సహకరించినా శిక్షార్హులు అవుతారని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, 18 ఏళ్లు నిండిన తర్వాతే వాహనాలు నడుపుతామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి ఆదేశాల మేరకు డిపోలో ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. సువర్ణ సారథ్యంలోని కళాబృందం ప్రదర్శన ఇచ్చారు. డిపో నుంచి రాజీవ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ రఘు, డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సైదులు, జి.సురేందర్ ఉన్నారు.


